రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలి

రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలి

తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఉలుకు పలుకూ లేదన్నారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడేందుకు మంత్రులు,ఎంపీలు,అధికారులతో కలిసి రేపు  ఢిల్లీకి వెళ్తున్నామన్నారు. కేంద్రవ్యవసాయశాఖ మంత్రిని..అవసరమైతే ప్రధాని మోడీని కలుస్తామన్నారు. ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.అంతేగాకుండా.. ఉద్యమంలో 700 మందికి పైగా  చనిపోయిన రైతులకు సంఘీభావంగా వారి కుటుంబాలను కాపాడే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు.  ఆందోళనలో చనిపోయిన  రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.3 లక్షలు ఇస్తామన్నారు. రైతులకు సారీ చెప్పడమే కాకుండా ఉద్యమంలో చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం తరపున రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. అంతేగాకుండా కనీస మద్దతు ధర చట్టం తేవాలన్నారు. రాబోయే పార్లమెంట్ లో ఈ విషయంపై పోరాటం చేస్తామన్నారు.