
- తనను రీల్ మినిస్టర్ అనడంపై రైల్వే మంత్రి వైష్ణవ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: మేము రీల్స్ చేసేవాళ్లం కాదని, కష్టపడి పనిచేసేవాళ్లమని రైల్వే మంత్రి అశ్వి నీ వైష్ణవ్ అన్నారు. ఇటీవల రైలు పట్టాలు తప్పడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. తనను రీల్ మినిస్టర్ అని పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో గురువారం రైల్వే పద్దుపై చర్చ జరిగింది. రూ.7.89 లక్షల కోట్ల పద్దుకు సభ ఆమోదం తెలిపింది.
మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. రైలు పట్టాలు తప్పిన ఘటనలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. గత నెలలో ఢిల్లీలో లోకో పైలట్‌ల వద్దకు రాహుల్ గాంధీ వెళ్లాడాన్ని ప్రస్తావిస్తూ “లోకోమోటివ్ డ్రైవర్లతో రీల్స్ తయారు చేయడంలో బిజీగా ఉన్నవారు వాళ్ల హయాంలో ఏమీ చేయలేదు” అని అన్నారు.