నేటి యువత పెడదారి పడుతోంది : వినోద్ కుమార్

నేటి యువత పెడదారి పడుతోంది : వినోద్ కుమార్

ప్రజలు కొన్న ప్రతి వస్తువు మీద వచ్చే పన్ను నుండి రాష్ట్రానికి ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఒక్క జమ్మికుంటలోనే కోటి ఇరవై లక్షల పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి పైసాకు లెక్క పత్రం ఉంటుందన్నారు. రాష్ట్ర సంపద నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. అభివృద్ది పనులకు, సంక్షేమ పథకాలకు రాష్ట్ర సంపద నుంచే నిధులు చెల్లిస్తున్నామనే విషయం ప్రతిపక్షాలు గుర్తించుకోవాలంటూ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెల్ ఫోన్లలో పోర్న్ వీడియోలు చూస్తూ యువత పెడదారి పడుతోందన్నారు. తమ పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడూ గమనిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లో ఉందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.