
సిద్ధిపేట గ్రంధాలయానికి గొప్ప చరిత్ర ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ గ్రంధాలయం ద్వారా ఎంతో మంది గొప్ప వ్యక్తులుగా ఎదిగారన్న ఆయన.. ఈ గ్రంధాలయం పురాతనమైందన్నారు. నూతన గ్రంధాలయం నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే మార్చ్ నెలలో నూతన గ్రంధాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపిన హరీష్.. మహిళలకు, పురుషులకు, విద్యార్థులకు వేరువేరుగా విభాగాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పుస్తకం మంచి నేస్తమని.. నేటితరం సెల్ ఫోన్ మోజులో పడి పుస్తక పఠనం మరిచిపోతున్నారని చెప్పారు. సెల్ ఫోన్ లకు బానిసలై పుస్తకాలను మరిచి పోతున్నామని.. జిల్లాలో 7 మండలాల్లో నూతన గ్రంధాలయాలను నిర్మిస్తామన్నారు. పుస్తకాల కొనుగోలు కోసం జిల్లాకు రూ. 40 లక్షలు మంజూరు అయ్యాయని.. ఆడబ్బుతో అందరికీ ఉపయోగపడే విధంగా పుస్తకాలు కొనుగోలు చేస్తామని తెలిపారు మంత్రి హరీష్.