ట్యాక్స్‌ కట్టలేం.. బండ్లు మీ దగ్గరే పెట్టుకోండి

ట్యాక్స్‌ కట్టలేం.. బండ్లు మీ దగ్గరే పెట్టుకోండి

వెహికల్స్‌‌ నడపనిదే పన్ను ఎట్ల కట్టాలని ఆర్టీవోల ఎదుట నిరసనలు
ట్యాక్స్‌‌ మాఫీ చేయాలని ఆపరేటర్ల డిమాండ్‌

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా ఎఫెక్ట్‌‌తో ప్రైవేటు బస్సులు, క్యాబ్‌లు నడుస్తలేవని.. మోటార్‌ ‌ట్యాక్స్‌ ‌కట్టలేమంటూ ప్రైవేట్‌‌ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌ ఆపరేటర్లు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీవోల ఎదుట నిరసన తెలిపారు. బండ్లు నడుస్తున్నా ట్యాక్స్ కడ్తలేరని ఆఫీసర్లు అంటున్నరని… అయితే
మా వెహికల్స్‌‌ అన్ని మీ ఆఫీస్‌‌లోనే పెట్టుకొని.. ట్యాక్స్‌‌ కట్టినప్పుడే ఇవ్వండని.. లేదంటే ట్యాక్స్‌‌ మాఫీ చేయాలని కోరారు. రెండువేల బస్సుల దాకా ఆర్టీవో ఆఫీసుల్లోనే వదిలేశారు. నిరసన చేపట్టిన ఆపరేటర్లను కొన్నిచోట్ల పోలీసులు అరెస్ట్‌‌చేశారు. హైదరాబాద్‌‌లోని ఖైరతాబాద్‌‌ ఆర్టీవో ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌‌ క్యాబ్స్‌ ‌అండ్‌ ‌బస్‌ ‌ఆపరేటర్స్‌ ‌అసోసియేషన్‌‌ ప్రెసిడెంట్‌ ‌నిజాముద్దీన్‌‌, తెలంగాణ క్యాబ్స్‌‌, ట్యాక్సీ జేఏసీ ఛైర్మన్‌‌ సలావుద్దీన్‌‌ మాట్లాడుతూ బండ్లు నడవక ఫిట్‌‌నెస్, పర్మిట్ ఫీజు, ఇన్సూరెన్స్, ఈఎంఐలు కట్టలేకపోతున్నామన్నారు. ఐటీ సంస్థలు సహా.. దాదాపు అన్ని కార్పొరేట్ కంపెనీలు సెప్టెంబర్ 30 వరకు తమకు వెహికల్స్‌‌ అవసరం లేదని చెప్పాయన్నారు. పెండ్లిలు, ఫంక్షన్లు, తీర్థయాత్రలు, టూర్స్‌‌కు వెళ్లడానికి ప్రజలు వెహికల్స్‌ ‌రెంట్‌‌కు తీసుకోవడంలేదన్నారు.

For More News..

అన్ లాక్ 2 గైడ్ లైన్స్ విడుదల

ఒకరిద్దరు చనిపోతే ఇంత బద్నాం చేస్తరా?

ఎంట్రెన్స్ టెస్టులు ఉంటయా..? ఉండవా..?