
న్యూఢిల్లీ: టీమ్‌లో ఉన్న ప్రతి ప్లేయర్ బాధ్యతలు ఏంటో స్పష్టంగా చెప్పామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. దీనివల్ల ఫామ్‌లో లేని ప్లేయర్లు కూడా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందన్నాడు. ‘కెప్టెన్‌గా నేను ప్రతి అంశాన్ని సింపుల్‌గా ఉంచుతాను. ప్రతి విషయాన్ని ప్లేయర్లతో పంచుకుంటా. వాళ్లకు ఏం కావాలో చూసుకుంటా. వాళ్ల బలం, బలహీనతలను కూడా చెబుతా. వాటిపై వర్క్ చేసిన తర్వాత ఫీడ్ బ్యాక్‌ను అడిగి తెలుసుకుంటా. దీనివల్ల వాళ్ల నుంచి నేను, మేనేజ్‌మెంట్ ఏం ఆశిస్తుందో తెలిసిపోతుంది’ అని రోహిత్ పేర్కొన్నాడు.
ఇక ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను ప్రత్యేకంగా చూడటం లేదన్నాడు. అన్ని మ్యాచ్‌ల్లాగే దీనిని కూడా ఆడతామన్నాడు. అయితే అనవసరపు ఒత్తిడిని తగ్గించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హిట్‌మ్యాన్ వెల్లడించాడు.