మాటలైతే కోటలు దాటుతున్నయ్.. చేతలు మాత్రం ప్రగతి భవన్‌లోనే

మాటలైతే కోటలు దాటుతున్నయ్.. చేతలు మాత్రం ప్రగతి భవన్‌లోనే

తెలంగాణ ప్రజలు కుటుంబ రాజకీయాల పెత్తనం పోవాలని  కోరుకుంటున్నారని,  ఈ మున్సిపల్ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు అన్ని చోట్ల పోటీ చేయాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికై కేంద్రం ఇచ్చే నిధులు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు మాత్రం ప్రగతి భవన్ దాటడం లేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కేంద్రం సహకారం చేసినా వాటిని అమలు చేయలేదన్నారు. కేంద్రానికి ఒక్క లబ్ది దారుని వివరాలు కూడా ఇవ్వలేదన్నారు.

AP రాజధాని గురించి మాట్లాడిన కిషన్ రెడ్డి.. రాజధాని అంశం ఆ రాష్ట్ర పరిధి లోనిది అని చెప్పారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతనే కేంద్రం స్పందిస్తుందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. గత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలని  కిషన్ రెడ్డి తెలిపారు.

Kishan Reddy attended the Meet the Press event at Bashir Bagh Press Club