RGV: రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్.. 'దహనం' వెబ్ సిరీస్‌పై మాజీ IPS అధికారిణి కేసు

RGV: రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్.. 'దహనం' వెబ్ సిరీస్‌పై మాజీ IPS అధికారిణి కేసు

సంచలన దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మ్ మరో సారి వివాదాల్లో చిక్కుకున్నారు.  ఆయనపై లేటెస్టుగా ఒక రిటైర్డ్ IPS అధికారిణి న్యాయపోరాటానికి దిగారు. ' దహనం' వెబ్ సిరీస్ లో తన అనుమతి లేకుండా తన  పేరును  , వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ మాజా ఐసీఎస్ అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ మారింది. 

'దహనం'.. వెబ్ సిరీస్ నేపథ్యం

"దహనం' వెబ్ సిరీస్ 2022లో రిలీజ్ అయింది. దీనిని అగస్త్య మంజు దర్శకత్వం వహించగా.. రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. ఈ సిరీస్ ను ఒక కమ్యూనిస్ట్ కార్మికుడి హత్యకు ప్రతీకారంగా సాగే హింసాత్మక కథాంశంతో రూపొందించారు.  అయితే..  రిటైర్డ్ IPS అధికారిణి అంజనా సిన్హా తన ఫిర్యాదులో ఈ సిరీస్ లోపాలను ఎత్తి చూపారు. “ఈ సిరీస్‌లో కేవలం హింస, అశ్లీలత మాత్రమే ఉన్నాయి. నా అనుమతి లేకుండా, నా పేరును ఉపయోగించి.. విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా.., పోలీసు అధికారిగా తాను కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని కూడా కించపరిచిందని ఆమె ఆరోపించారు.

ఆరోపణల వెనుక అసలు కథ

పోలీసు అధికారిగా అంజనా సిన్హా జీవితం అంతా పోరాటాలతో నిండిందే. తన కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమె సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి పేరు, ఆమె వృత్తిని ఒక వివాదాస్పద వెబ్ సిరీస్‌లో ఉపయోగించడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. "నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అసభ్యకరమైన, హింసాత్మక కథాంశాలకు మద్దతు ఇవ్వలేదు. నా పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం నా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన,” అని ఆమె తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఇటీవల తన స్నేహితురాలి ద్వారా 'దహనం' వెబ్ సిరీస్ గురించి తెలుసుకున్నారు. ఈ సిరీస్‌లో తన గురించి చూపించడంతో ఆశ్యర్యానికి గురైయ్యారని ఫిర్యాదులో తెలిపారు.

ALSO READ : హ్యాకర్ల చేతిలో 'రియల్ స్టార్' .. అభిమానులకు హెచ్చరిక.. అసలు ఏం జరిగిందంటే?

పోలీసుల చర్యలు

ఈ ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్శకుడు, నిర్మాతపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వివాదం ఇప్పుడు డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలకు ఒక గట్టి సందేశాన్ని పంపింది. ఎటువంటి అనుమతులు లేకుండా, ఇతరుల గుర్తింపును వాణిజ్యపరంగా వాడుకోవడానికి వీలు లేదని ఈ కేసు నిరూపిస్తుంది. ఒక మాజీ ఐపీఎస్ అధికారిని కావడంతో ఈ కేసు ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ పోరాటంలో అంజనా సిన్హా గెలుస్తారా, లేదా అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఈ కేసు భవిష్యత్తులో ఓ సరికొత్త చట్టపరమైన మార్గానికి నాంది పలుకుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.