వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్

వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్

న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా తెలిపింది. ఎక్స్ పర్ట్స్ అంచనాలు నిజం చేస్తూ.. 11వ సారి వడ్డీరేట్లు యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 4 శాతంగా.. రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉంటుందన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిస్థితులున్నా.. ఈసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదన్నారు. ఇకపోతే, 2020 మే 22న చివరిసారిగా వడ్డీ రేట్లలో ఆర్బీఐ మార్పులు చేసింది. ఫలితంగా రెపో రేటు 4 శాతం కనిష్ఠానికి చేరింది. ఈసారి కూడా అదే రేటు కొనసాగిస్తూ.. ద్రవ్యోల్బణం దృష్ట్యా అకామడేటివ్ స్టాన్స్ ను ఆర్బీఐ మార్చుకోవచ్చని అంచనావేశారు ఎక్స్ పర్ట్స్. అందుకు తగ్గట్లే శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయం తీసుకుంది. పునరుద్ధరణ, సుస్థిరాభివృద్ధి, ద్రవ్యోల్బణ కట్టడి వ్యూహంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

ఇప్పట్లో వంట నూనె ధరలు తగ్గవ్

భారత ఆర్థిక వ్యవస్థ కొత్త సమస్య ఎదుర్కొంటుందని.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం గురించి శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రతికూల ప్రభావం చూపుతుందనది అంచనా వేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7.2 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. పెట్రో ధరల పెరుగదలతో ద్రవ్యోల్బణం 4.5 శాతం నుంచి 5.7 శాతానికి పెరుగుతుందని.. వంట నూనె ధరలు కొంతకాలం అధికంగానే ఉంటాయన్నారు. ఒమిక్రాన్ కట్టడితో కలిగిన ప్రాఫిట్స్ గురించి మాట్లాడారు. విదేశీ మారక నిల్వలకు లోటు లేదని.. పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఆర్బీఐ సర్వసన్నద్ధమై ఉందని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

విమెన్ క్రికెటర్ ఇంటిని కూల్చేసిన జీహెచ్ఎంసీ అధికారులు

మహిళా ఎంపీతో థ‌రూర్ చిట్‌చాట్.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్‌

అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు