50 లక్షల కోట్ల డాలర్ల  గ్రీన్​ ఎనర్జీని ఎగుమతి చేసే సత్తా మనది

50 లక్షల కోట్ల డాలర్ల  గ్రీన్​ ఎనర్జీని ఎగుమతి చేసే సత్తా మనది

రిలయన్స్​ చైర్మన్​ ముకేశ్​ అంబానీ
న్యూఢిల్లీ: మనదేశం సాధారణ పెట్రో ప్రొడక్టుల నుంచి క్లీన్​ ఎనర్జీలకు మారుతున్నందున, గ్లోబల్​ ఎనర్జీ లీడర్​గా ఎదిగే సత్తా ఇండియాకు ఉందని రిలయన్స్​ చైర్మన్​ ముకేశ్​ అంబానీ అన్నారు. ఇందుకు కొత్త టెక్నాలజీలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. తగిన ప్లాన్​తో ముందుకు వెళ్తే రాబోయే 20 ఏళ్లలో 50 లక్షల ట్రిలియన్​ డాలర్ల విలువైన గ్రీన్​ ఎనర్జీని ఎగుమతి చేసే కెపాసిటీని సాధించవచ్చని అన్నారు. తమ కంపెనీ కూడా పెద్ద ఎత్తున గ్రీన్​ హైడ్రోజన్​ను తయారు చేస్తుందని ప్రకటించారు. మిగతా దేశాల కంటే రిన్యువబుల్​ ఎనర్జీ ఇన్వెస్ట్​మెంట్లకు ఇండియాలోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంబానీ పేర్కొన్నారు. అయితే ఇదంతా ఒక్క రోజులోనే జరిగే పనికాదని, 20–30 ఏళ్లు పడుతుందని చెప్పారు. పెట్రోల్​, బొగ్గు వాడకాన్ని ఆపడానికి తగిన ప్లాన్​రెడీ కావాలని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఆసియా ఎకనామిక్​ డైలాగ్​మీటింగులో ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ వల్ల తక్కువ ఖర్చుతో క్లీన్​ ఎనర్జీలను తయారు చేయవచ్చని అంబానీ పేర్కొన్నారు. ఇండియా క్లీన్​ ఎనర్జీ మార్కెట్​ లీడర్​గా ఎదిగితే పెద్ద సంఖ్యలో జాబ్స్​ వస్తాయని చెప్పారు.