ఎస్పీ హయాంలో అల్లర్లు నడిచాయి

ఎస్పీ హయాంలో అల్లర్లు నడిచాయి

యూపీలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇప్పటికి రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. మరో ఏడు విడతల్లో ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఈ క్రమంల్ ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తతున్నారు. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్నోంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో గూండాలు, నేరస్థులు, మాఫియాలు, సంఘ వ్యతిరేకులు అల్లర్లు నడిపారన్నారు. అభివృద్ధి పనులు కూడా నిర్దిష్ట ప్రాంతంలోనే.. నిర్దిష్ట వర్గానికి మాత్రమే పరిమితం చేశారన్నారు. యూపీలో సమాజ్‌వాదీ, బీజేపీలను అధికారంలోకి రాకుండా ఆపాలన్నారు. బీజేపీ ప్రభుత్వం తన కులతత్వ, పెట్టుబడిదారీ విధానాలను ఆర్‌ఎస్‌ఎస్ సంకుచిత అజెండాను అమలు చేయడంలో బిజీగా ఉందన్నారు. మతం పేరుతో ద్వేషం, ఉద్రిక్తత వాతావరణం నెలకొందన్నారు మాయావతి.

మరోవైపు ఎస్పీ అధినేత అకిలేష్ యాదవ్ సైతం ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఐదేళ్లపాటు ప్రజలకు ఉచిత రేషన్‌తో పాటు పేదలకు కిలో నెయ్యి ఇస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. అదే సమయంలో బిజెపి ప్రభుత్వం తన సొంత ఉచిత రేషన్ పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. గతంలో కూడా సమాజ్‌వాదీ పార్టీ రేషన్ ఇచ్చిందన్నారు. ఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం మా పేదలకు రేషన్ ఇస్తామన్నారు. దీంతో పాటు ఆవాల నూనె, ఏడాదికి రెండు సిలిండర్లు ఇస్తామన్నారు. పేదల ఆరోగ్యం మెరుగుపడేందుకు, ఒక కిలో నెయ్యి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్. 

ఇవి కూడా చదవండి: 

బీజేపీకి ఓటేసి తప్పు చేశాం

కాంగ్రెస్కు జిరాక్స్ ఆమ్ ఆద్మీ పార్టీ:మోడీ