ప్రపంచ శ్రేయస్సు కోసం అమెరికాకు అన్ని విధాలా సహకరిస్తాం

ప్రపంచ శ్రేయస్సు కోసం అమెరికాకు అన్ని విధాలా సహకరిస్తాం

రష్యా, అమెరికా దేశాల ప్రయోజనాల కోసం, ప్రపంచ సమాజ శ్రేయస్సు కోసం అమెరికాకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు చెప్పారు రష్యా అధ్యక్షుడు పుతిన్.రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ… ప్రపంచం ముందున్న సమస్యలను ఎదుర్కోవడం కోసం ఇరు దేశాలు బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ ను ఇంత వరకు రష్యా అభినందించలేదు. బైడెన్ గెలిచినట్టు అమెరికా ఎలక్టోరల్ కాలేజీ అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న బైడెన్ కు అభినందనలు తెలిపారు.