కోతులను తరిమేసే వారికే ఓటేస్తాం ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదారం గ్రామస్తుల డిమాండ్‌‌‌‌‌‌‌‌

కోతులను తరిమేసే వారికే ఓటేస్తాం ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదారం గ్రామస్తుల డిమాండ్‌‌‌‌‌‌‌‌

ములకలపల్లి, వెలుగు : గ్రామంలో కోతుల సమస్యను పరిష్కరించే వారికే సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో మద్దతు ఇస్తామంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 

గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కోతులు పంటలను నాశనం చేస్తున్నాయని, పిందె, కాయ దశలోనే కొరికి పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించే వారికే సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో ఓట్లు వేస్తామంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలు, యూత్‌‌‌‌‌‌‌‌ సభ్యులంతా కలిసి గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.