IPL 2024: బాబర్‌ ఆజాంకు స్వాగతం పలికిన ఆర్‌సీబీ.. కోహ్లీతో కలిసి ఓపెనింగ్!

IPL 2024: బాబర్‌ ఆజాంకు స్వాగతం పలికిన ఆర్‌సీబీ.. కోహ్లీతో కలిసి ఓపెనింగ్!

క్రికెట్ ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకోవడంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రూటే వేరు. సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా.. నవ్వులు పంచాలన్నా అది వారికే సాధ్యం. ఇప్పుడు అలాంటి మరో వార్తను ఆర్‌సీబీ సోషల్ మీడియా అడ్మిన్ అభిమానుల ముందుంచారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాంను ట్రేడ్ విండో ద్వారా సొంతం చేసుకోనున్నాం అనేది ఆ కథనం సారాంశం. 

దేశంలో ఐపీఎల్ 2024 సందడి మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆటగాళ్ల ట్రేడింగ్(బదిలీలు) ప్రక్రియ మొదలవ్వగా.. ప్లేయర్స్ రిటెన్షన్, రిలీజ్ జాబితాలు అందజేసేందుకు నవంబర్ 26 డెడ్‌లైన్‌. ఈ తేదీలోపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిలీజ్, రిటైన్‌లకు సంబంధించిన పూర్తి జాబితాలను బీసీసీఐకి సమర్పించాలి. ఈ గడువు మరో 24 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ పనిని వేగవంతం చేశాయి. ఈ తరుణంలో ఆర్‌సీబీ.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాంను ట్రేడ్ విండో ద్వారా సొంతం చేసుకోనున్నట్లు ట్వీట్ చేసింది. 

500 టన్నుల ఆశీర్వాద్ అట్టా.. 

బాబర్ ఆజాం కోసం 500 టన్నుల ఆశీర్వాద్ అట్టా పాకిస్తాన్ దేశానికి అందిస్తామని ఆర్‌సీబీ ఆఫర్ చేసింది. భారత జట్టులో రుతురాజ్ పాత్ర ఏమిటో తమ జట్టులో బాబర్ పాత్ర అదేనని తెలిపింది. అంటే, జాతీయ జట్టులో రుతురాజ్ ఓపెనర్ కనుక ఇక్కడా అదేనని అర్థం. కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేస్తాడని అర్థం వచ్చేలా ట్వీట్ చేసిందనమాట. కాగా, గత కొంతకాలంగా పాకిస్తాన్ పౌరులు గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ ఈ పోస్ట్ చేసింది.

పాక్ క్రికెటర్లపై నిషేధం

కాగా, 2009 ముంబై ఉగ్రదాడుల అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనడాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిషేధించింది.