
సూర్యాపేట, వెలుగు : బీజేపీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండలో రామమందిరం నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ప్రకటించారు. మంగళవారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసమే హిందువులను ఉపయోగించుకుంటోందన్నారు. ఉండ్రుగొండ గిరిదుర్గం, రామమందిరానికి సంబంధించిన భూములను మంత్రి అండదండలతో టీఆర్‌ఎస్ లీడర్లు అక్రమంగా పట్టాలు చేసుకున్నారని ఆరోపించారు. రామమందిరానికి సంబంధించిన భూములను పరిశీలించేందుకు వెళ్లిన వానరసేనను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్, పట్టణ అధ్యక్షుడు అబీద్, పల్సా మల్సూర్‌గౌడ్ పాల్గొన్నారు.