
రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి తలసాని స్పందించారు. రాజ్యాంగ హోదాలో ఉండి రిపబ్లిక్ డే రోజు అలా మాట్లాడకూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. గవర్నర్పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకొని గవర్నర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సీఎస్, డీజీపీని పక్కన పెట్టుకొని.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని ఏంటని ప్రశ్నించారు.
అంతకు ముందు డెక్కన్ మాల్ బిల్డింగ్ ను మంత్రి తలసాని పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న భవనం కూల్చివేత పనులు సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు. కూల్చివేత పనులు ఆలస్యమైనా సజావుగా జరిగాలేలా చూస్తూమని చెప్పారు.