లాజిస్టిక్ సేవలు విస్తృతం చేస్తాం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

లాజిస్టిక్ సేవలు విస్తృతం చేస్తాం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయబోతున్నామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. AM TO PM, PM TO AM పేరుతో లాజిస్టిక్ సేవలు మరింత విస్తృతం చేస్తున్నామని ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్సిల్ బుక్ చేస్తే రాత్రి 9 గంటల వరకు పార్సిల్ చేరుతుందని చెప్పారు. రాత్రి 9 గంటల  వరకు పార్సిల్ బుక్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు 12గంటల వరకు పార్సిల్ చేరే విధంగా కొత్త సర్వీస్ అందుబాటులో తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. దాంతో పాటు 1 కేజీ పార్సిల్ కు సర్వీస్ ఛార్జి కూడా తక్కువ ధరకు పంపేల అవకాశం ఇస్తున్నామన్నారు. 2020 జూన్ లో కార్గో సర్వీసులు చేపట్టామని, ఇప్పుడు లాజిస్టిక్ ను ఇంకా విస్తరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 192 లాజిస్టిక్స్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్న సజ్జనార్.. 10 టన్నుల క్లోజ్ వాహనాలు, 10 టన్నుల ఓపెన్ వెహికిల్ ఉన్నాయని చెప్పారు. 

ఈ కార్గో సేవలు మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక వరకు నడుస్తున్నాయని  సజ్జనార్  అన్నారు. ఏపీ, తెలంగాణలో ఈ సేవలు భాగస్వామ్యంగా పనిచేస్తున్నాయని చెప్పారు. అంగని వాడి కేంద్రంలో సరుకులు దీని ద్వారా సమయానికి అందుతున్నాయన్నారు. ప్రభుత్వ శాఖలు సైతం తమ లాజిస్టిక్ సేవలు బాగా ఉపయోగించు కుంటున్నాయని చెప్పారు. కార్గో పార్సిల్ ద్వారా మొదటి ఏడాది రూ.36 కోట్లు, రెండో ఏడాది రూ. 67.90 కోట్ల ఆదాయం  వచ్చిందని స్పష్టం చేశారు. ఈ లాజిస్టిక్ సేవల ద్వారా మరింత ఆదాయం వస్తుందని ఆశిస్తున్నామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రూ. 99తో AM, PM పార్సిల్ సదుపాయం తీసుకొచ్చామని, వాహనాలను కూడా పెంచే ఆలోచన చేస్తు్న్నామని చెప్పారు.