
అమెరికా భారత్ కు విధించిన టారిఫ్ డెడ్ లైన్ ఆగస్టు 27 కావటంతో ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ ప్రపంచ దేశాలలో ఉంది. గడువు సమీపించడంతో ఇండియాపై మరింత ఒత్తిడి మొదలైందని భావిస్తున్నారు. కానీ డెడ్ లైన్ పై భయపడేదేమీ లేదని ప్రధాని మోదీ అన్నారు. తమ ప్రత్యామ్నాయ మార్గాలు తమకున్నాయని సోమవారం (ఆగస్టు 25) స్పష్టం చేశారు మోదీ.
డెడ్ లైన్ సమీపించిన వేళ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అహ్మదాబాద్ లో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న మోదీ టారిఫ్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత ఒత్తిడి వచ్చినా ఆందోళన లేదు.. దానికి ఎదిరించి నిలబడేందుకు మరింత శక్తిని పుంజుకుంటాం.. గుజరాత్ నుంచి ఆత్మనిర్భర్ భారత్ కు కొత్త శక్తి పుట్టుకొస్తోంది. ఇది ఇరవై ఏళ్ల హార్డ్ వర్క్.. అని అన్నారు మోదీ.
ఆగస్టు లో ట్రంప్ భారత్ పై మరో 25 శాతం సుంకాలను విధించిన విషయం తెలిసిందే. దీంతో 50 శాతానికి యూఎస్ టారిఫ్స్ చేరుకున్నాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు పెనాల్టీగా టారిఫ్ ను 50 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. అయితే టారిఫ్ తగ్గించాలని భారత్ తమ కండిషన్స్ కు ఒప్పుకోవాలని సూచిస్తున్నారు ట్రంప్.
ఈ విషయంలో భారత్ కూడా సీరియస్ గానే ఉంది. ట్రంప్ బెదిరించినా.. తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా తక్కువ ధరకు ఆయిల్ అందిస్తున్న రష్యాతోనే క్రూడ్ ఆయిల్ కొంటామని స్పష్టం చేసింది. చూడలి మరి.. ఆగస్టు 27 డెడ్ లైన్ వరకు టారిఫ్ విషయంలో ఎలంటి నిర్ణయాలు తీసుకుంటారో.