తప్పుడు వీడియోలు పెడితే నోటీసులు జారీ చేస్తాం

తప్పుడు వీడియోలు పెడితే నోటీసులు జారీ చేస్తాం

హైదరాబాద్: తప్పుడు వీడియోలు పోస్ట్ చేసినా, ప్రసారం చేసిన నోటీసులు జారీ చేస్తామని హైదరాబాద్ అడిషనల్ సీపీ చౌహాన్ హెచ్చరించారు. సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా బ్రాడ్ కాస్టింగ్ ప్రమాణాలు పాటించాలని సూచించారు. సెర్క్యూలైట్ అవుతున్న వీడియోస్ అన్నీ నిజమని చెప్పలేమన్నారు. వాటిని వెరిఫై చేసి ప్రసారం చెయ్యాలని.. అన్ని ఛానెల్స్ పై మాకు నమ్మకం ఉందన్నారు. సోషల్ మీడియాలోనే కాస్త ఆలోచించి పోస్ట్ చేస్తే మంచిదని చెప్పారు. తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలుంటాయని చౌహాన్  సీరియస్ అయ్యారు.

ఓల్డ్ సిటీలో పరిస్థితులు అదుపు తప్పకుండా కేంద్ర రాష్ట్ర బలగాలు రంగంలోకి దిగాయి. రాజాసింగ్ కు వ్యతిరేకంగా రెండు రోజుల నుంచి నిరసనలు పెరుగుతున్నాయి. చార్మినార్, శాలిబండ, కంచన్ బాగ్, గుల్జార్ హౌస్ ఏరియా సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి ఆందోళనలు కొనసాగడంతో ఎక్కడిక్కడ వారిని అక్కడ కట్టడి చేశాయి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు. కొందరిని అదుపులోకి తీసుకుని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఉదయం 80 మంది నిరసనకారులను పోలీసులు విడుదల చేశారు. మరోవైపు పాతబస్తీలో పరిస్థితిని సీపీ సీవీ ఆనంద్ సమీక్షించారు. తెల్లవారుజామున పాతబస్తీ ఏరియాకు వెళ్లారు.

పాతబస్తీలో భారీగా బలగాలను మోహరించారు పోలీసులు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘలు జరగకుండా ఫుల్ సెక్యూరిటీ పెట్టారు. పాతబస్తీ మొత్తం పోలీసుల నిఘా నీడలో ఉంది. రేపు శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలు జరుగుతాయి.. దీంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. డాగ్ స్క్వాడ్, అదనపు బలగాలను మోహరించిన ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.