కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉత్తమ్ ఆగ్రహం

కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలపై ఉత్తమ్ ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు ప్రతి ఏడాది పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. నాలుగేళ్లు అయినా సీఎం కేసీఆర్ ఇప్పటికీ రుణమాఫీ చేయలేదన్నారు. నాలుగేళ్ల వడ్డీ భారంతో రూ.2 లక్షల వరకు అప్పు అయ్యిందని, రుణమాఫీ చేయనందుకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

టీఆర్ ఎస్ పాలనలో పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పంట బీమా ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణలో రైతుల్ని గాలికి వదిలేశారని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు రైతుల ఆదాయం సగానికి తగ్గిందన్నారు. రాహుల్ గాంధీ సభకు నల్గొండ నుండి భారీ ఎత్తున జనసమీకరణ చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

మళ్లీ పడగ విప్పుతున్న ఎబోలా

పీకే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు