- కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని జాతరలో పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏడుపాయల జాతర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్య కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్, తాగునీరు, పార్కింగ్, దర్శన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఈ సంవత్సరం జాతరకు దాదాపు పది లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను ప్రశాంతంగా ముగించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వీరేశం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
