
హైదరాబాద్, వెలుగు: దేశీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా 150 షోరూమ్‌లను, సర్వీస్ సెంటర్‌లను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో తమ 50వ షోరూమ్, సర్వీస్ సెంటర్‌ను మొదలుపెట్టిన సందర్భంగా కంపెనీ సీనియర్ఎగ్జిక్యూటివ్స్ఈ విషయాన్ని వెల్లడించారు.
ఓబెన్ ఎలక్ట్రిక్ ఇటీవల గుంటూరు (ఆంధ్రప్రదేశ్), రాంచీ (జార్ఖండ్), జబల్‌పూర్ (మధ్యప్రదేశ్), అలీగఢ్, ఉన్నావ్ (ఉత్తర ప్రదేశ్), పాలక్కాడ్ (కేరళ) వంటి నగరాల్లో ఔట్‌లెట్స్‌ను తెరిచింది. దేశంలోని 15 రాష్ట్రాల్లోని 37 నగరాల్లో కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తమ ఎలక్ట్రిక్‌బైక్ రోర్ ఈజెడ్ మార్కెట్లో మంచి విజయం సాధించిందని, ఇటీవలే రోర్ ఈజెడ్ సిగ్మా మోడల్‌ను తెచ్చామని కంపెనీ సీఈఓ మధుమిత అగర్వాల్ చెప్పారు.
అందరికీ ఈవీలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 15 వరకు తమ ఈవీలను కొనేవారికి బంగారు నాణెం బహుమతిగా ఇస్తామని తెలిపారు.