బీసీ రిజర్వేషన్లను పరిరక్షించుకుంటాం: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

బీసీ రిజర్వేషన్లను పరిరక్షించుకుంటాం: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

బషీర్​బాగ్​, వెలుగు: స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను పరిరక్షించుకుంటామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. రిజర్వేషన్ల పరిరక్షణకు జీవో 9ను కాపాడుకోవడానికి సంబంధించిన పిటిషన్లలో తాను ఇంప్లీడ్ అవుతున్నట్లు తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ నేత, న్యాయవాది జక్కుల వంశీ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

గవర్నర్ ప్రొసీజర్, మెరిట్  అంశంపై సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి కావాలని హైకోర్టు తీర్పు ప్రకారం జీవో ఇచ్చామనే ప్రభుత్వ వాదనను సమర్ధిస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశంలో సెప్టెంబర్ లో పంపించిన బిల్లు తేదీని పరిగణలోకి తీసుకోవాలనే వాదన ద్వారా సాంకేతిక అంశాల సమస్యను అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల ద్వంద వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ ఐక్య కులాల వేదిక అధ్యక్షుడు పాండు యాదవ్, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నరహరి పాల్గొన్నారు.