పారిశ్రామికవేత్తలకు సౌలతులు కల్పిస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

పారిశ్రామికవేత్తలకు సౌలతులు కల్పిస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలంతా ఎక్కడున్నా కలిసి మెలిసి ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. అమెరికాలోని సియాటెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్​ను ఆయన శనివారం ప్రారంభించారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐలు భాగస్వామ్యం అవ్వాలని.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సౌలతులు సమకూర్చేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో  ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, మదన్ మోహన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు పైల్ల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.