తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తాం.. ప్రతి పౌరుడికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తాం.. ప్రతి పౌరుడికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం

సిద్దిపేట, వెలుగు: తెలంగాణలోని ఉద్యోగాల భర్తీకి రానున్న రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్‌‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. 

తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులకు గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చేలా  ప్రత్యేక  కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జిల్లాలో ఏడాదికి 1.50 లక్షల  మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమైతే  ఇక్కడ 50 వేల మెట్రిక్ టన్నుల పండుతోందని, రైతులు అవసరమైన సన్న బియ్యం పండించేలా అవగాహన కల్పిస్తామన్నారు. మూడు లక్షల ఈత చెట్లు సిద్ధంగా ఉన్నాయని  వాటిని కాలువ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో నాటడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. 

ఆర్టీసీ ఆపరేషనల్ లాస్ నుంచి లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు. అనంతరం ఐడీవోసీలోని చాంబర్‌‌‌‌లో కలెక్టర్ కె.హైమావతి, పోలీస్‌‌ కమిషనర్ రష్మీ పెరుమాళ్‌‌, జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించి పలు సూచనలు చేశారు.