మెదక్ గెలిచి సీఎం రేవంత్కు గిప్ట్ గా ఇస్తాం : కొండా సురేఖ

 మెదక్ గెలిచి సీఎం రేవంత్కు గిప్ట్ గా ఇస్తాం :  కొండా సురేఖ

మెదక్ పార్లమెంటు స్థానాన్ని గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు మెదక్ సెగ్మెంట్ ఇంచార్జి,మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో పార్టీ కార్యకర్తలతో సమావేశమై దిశానిర్ధేశం చేశారు. మెదక్ లోక్ సభ కాంగ్రెస్ అభర్థి నీలం మధును గెలిపించడానికి కార్యకర్తలు,నియోజకవర్గ ఇంచార్జీలు కష్టపడాలన్నారు కొండా సురేఖ. కొత్తగా వస్తున్న నేతలను సైతం చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పాత నేతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు కొండా సురేఖ.

మరోవైపు మాజీమంత్రి కేటీఆర్ పంపిస్తానన్న  లీగల్ నోటీసులపై  మంత్రి కొండా సురేఖ స్పందించారు. తనకైతే ఏ నోటీసులూ రాలేదన్నారు. మనది ప్రజాస్వామ్య దేశం. మాట్లాడే హక్కు ఉంది. ఆయన చెప్పినదానికి నేను కౌంటర్ మాట్లాడా. అది ఆయనకు బాధ కలిగిస్తే ఏం చేస్తాడో చేసుకోనివ్వండి అని అన్నారు. తర్వాత మేమేం చేయాలో అది చేస్తామని.. తాను ఏదైనా ఓపెన్ గా   మాట్లాడతానని చెప్పారు. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకోవడం మంచిది అని చెప్పా అంతేనని ఆమె వివరించారు.

ALSO READ :- DC vs KKR: బాదుడే బాదుడు: పవర్ ప్లేలో నరైన్ హాఫ్ సెంచరీ