
సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. జూన్ 7న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం భాషకి హద్దు లేదు. బాహుబలి సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్లింది. ఈ వెపన్ మూవీ కూడా అలాంటి చిత్రమే.
సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో కొత్త ట్రెండ్ కాబోతోంది’ అని అన్నారు. వసంత్ రవి మాట్లాడుతూ ‘ఫాంటసీ, యాక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్‌తో చాలా ఇంటరెస్టింగ్‌గా గుహన్ కథను రాశారు. కామిక్ స్టైల్లో ఉంటుంది’ అని చెప్పాడు. ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్‌లో నటించడం హ్యాపీ అని చెప్పింది తాన్యా హోప్. గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ ‘ఇదొక సైఫై థ్రిల్లర్. రెండో వరల్డ్ వార్‌ను బేస్ చేసుకుని స్టోరీ రాశా. సత్యరాజ్‌ను కొత్త కోణంలో చూస్తారు. వసంత్ రవి మంచి పాత్ర చేశారు. సెకండాఫ్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది’ అని అన్నాడు. నటులు రాజీవ్ పిళ్లై సహా టీమ్ అంతా పాల్గొన్నారు.