మాస్కు పెట్టుకోకుంటే 5 వేలు ఫైన్ లేదా మూడేళ్ల జైలు

మాస్కు పెట్టుకోకుంటే 5 వేలు ఫైన్ లేదా మూడేళ్ల జైలు

అహ్మదాబాద్: కరోనా కేసులు పెరుగుతుండటంతో గుజరాత్ లోని అహ్మదాబాద్ సిటీలో మాస్కులు తప్పని సరి చేశారు. మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తే రూ.5 వేల ఫైన్ లేదా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ” మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రతి ఒక్కరికీ మాస్క్ తప్పనిసరి. మాస్కులు లేకుండా బయటకొస్తే 5 వేలు ఫైన్ వేస్తాం. ఫైన్ కట్టకుంటే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది” అని విజయ్ నెహ్రా అన్నారు. మార్కెట్ లో దొరికే మాస్కులు ధరించాలని లేదా కర్చీఫ్ కట్టుకోవాలని సూచించారు. ఇది అందరికీ వర్తిస్తుందన్నారు. గుజరాత్ లో అత్యధికంగా అహ్మదాబాద్ లోనే కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.అహ్మదాబాద్ సిటీలో కరోనా సోకి 11 మంది చనిపోగా, 266 మందికి పాజిటివ్ వచ్చింది.