మాస్కుంటేనే గోల్కొండ బోనాలకు ఎంట్రీ

మాస్కుంటేనే గోల్కొండ బోనాలకు ఎంట్రీ

హైదరాబాద్: గోల్కొండ బోనాలకు రావాలంటే మాస్కు ధరించడం తప్పనిసరి అని.. మాస్కు ఉంటేనే బోనాలకు అనుతిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం గోల్కొండ బోనాల భద్రతపై ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని శాఖ ల అధికారులతో కలసి 500 వందల మందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ పని చేయనున్నాయని ఆయన చెప్పారు. 
కరోనా నిబంధనలకు అనుగుణంగా బోనాలు
కరోనా నిబంధనలకు లోబడే బోనాలు నిర్వహిస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. బోనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ వాడాలని, అలాగే.. సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. మాస్క్ లేనివారికి గోల్కొండ లోకి ఎంట్రీ ఉండదన్నారు. రేపు బోనాల సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని.. పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.