హైదరాబాద్‌ హైటెక్స్లో వేర్‌‌‌‌మెట్‌‌ ఎక్స్‌‌పో ప్రారంభం

హైదరాబాద్‌ హైటెక్స్లో వేర్‌‌‌‌మెట్‌‌ ఎక్స్‌‌పో ప్రారంభం

హైదరాబాద్‌‌, వెలుగు: వేర్‌‌‌‌ హౌసింగ్ అండ్ మెటీరియల్‌‌ హ్యాండ్లింగ్ ఎక్స్‌‌పో శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్లో ప్రారంభమైంది. ఈ నెల 9 వరకు కొనసాగనున్న ఈ మూడు రోజుల ఎక్స్‌‌పోలో 200కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. గతంలో కోయంబత్తూరు, చెన్నైలో వేర్‌‌‌‌మెట్‌‌ ఎక్స్‌‌పోలు జరిగాయి.

హైదరాబాద్‌‌లో ఇదే మొదటిసారి. ఏఐ, ఆటోమేషన్ ఆధారంగా మెటీరియల్ హ్యాండ్లింగ్, స్టోరేజ్ టెక్నాలజీలను ప్రదర్శించనున్నారు. ఎంఎస్‌‌ఎంఈల వృద్ధికి  ఈ  ఎక్స్‌‌పో సాయపడుతుందని నిర్వాహకలు పేర్కొన్నారు. ఎక్స్​పోకు ఆరు వేలకిపైగా సందర్శకులు రావచ్చని అంచనా వేస్తున్నారు.