భారత్-ఐర్లాండ్ తొలి టీ20కి వర్షం ముప్పు.. అభిమానుల్లో ఆందోళన

భారత్-ఐర్లాండ్ తొలి టీ20కి వర్షం ముప్పు.. అభిమానుల్లో ఆందోళన

Weather Alert for IND vs IRE 1st T20I: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో సరికొత్తగా రూపుదిద్దుకున్న టీమిండియా.. ఇయ్యాల (జూన్ 26, శుక్రవారం) బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో మొదటి టీ20 మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు వాతావరణం అంతగా సహకరించేలా కనిపిస్తలేదు.. బెల్ఫాస్ట్‌లో మ్యాచ్ జరిగే సమయంలో అప్పుడప్పుడు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. దాంతో, ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ డెబ్యూ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ఈ రెయిన్ అప్‌డేట్ కాస్త టెన్షన్ పెడుతోంది.

బెల్ఫాస్ట్ వెదర్ రిపోర్ట్: 
బీబీసీ (BBC) వెదర్ ఫోర్‌కాస్ట్ ప్రకారం.. ఇయ్యాల (శుక్రవారం) బెల్ఫాస్ట్‌లో రోజంతా మేఘావృతమై ఉండి, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉంది. కాగా మ్యాచ్ జరిగే గంటల్లో ఉష్ణోగ్రత 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పోరు జరిగే సమయంలో వర్షం పడటానికి 30 నుంచి 43 శాతం అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే భారీ వర్షం పడే సూచనలు లేవు.. కేవలం అప్పుడప్పుడు జల్లులు (Passing showers) మాత్రమే పడొచ్చు.. మధ్య మధ్యలో ఎండ కూడా రావొచ్చని తెలిపారు. ఒకవేళ మ్యాచ్‌కు అంతరాయం కలిగినా ఓవర్లు తగ్గించి అయినా మ్యాచ్‌ను పూర్తి చేసే ఛాన్స్ ఉంది.  

అందరి కళ్లూ వైభవ్ సూర్యవంశీ పైనే: 
టాస్ పడకముందే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక పేరు.. వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్‌గా వచ్చి ప్రపంచ స్థాయి బౌలర్లను భయపెట్టిన ఈ యంగ్ సెన్సేషన్, తన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాలో మొదటిసారి చోటు దక్కించుకున్నాడు. ఒకవేళ ఇయ్యాల్టి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వస్తే.. భారత సీనియర్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా (Youngest Player) వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.