వెదర్ అలర్ట్ : 3 రోజుల పాటు గాలివాన

వెదర్ అలర్ట్ : 3 రోజుల పాటు గాలివాన

ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి కోమోరిన్ ప్రాంతం వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది.

తెలంగాణ:

రాగల మూడురోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రెండు రోజుల పాటు మధ్యాహ్నం గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

కోస్తా ఆంధ్ర:

రాగల మూడురోజులు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ:

శని, ఆది వారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.