తెలంగాణకు వర్ష సూచన..3 రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణకు వర్ష సూచన..3 రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్సుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఉపరితల ద్రోణి విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదవ్వొచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.