భారీ నుంచి అతి భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక

భారీ నుంచి అతి భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ: హిమాచల్​ప్రదేశ్, బెంగాల్, సిక్కింలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 11.56 సెంటీ మీటర్ల నుంచి 20 సెంటీ మీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది.

 ఉత్తరాఖండ్‌‌‌‌లో 15, 16వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో 11 సెంటీ మీటర్ల నుంచి 20 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసే చాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌‌‌‌లోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండి జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.