
రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాలకు భారీ వర్షసూచన జారీ చేసింది వాతావరణ శాఖ.
నిన్న ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందన్నారు అధికారులు. మిగగా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలే పడే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు రుతుపవనాల ప్రభావవంతో నిన్న హైదరాబాద్ శివార్లతో పాటు జిల్లాల్లో వర్షం పడింది. మేడ్చల్ జిల్లాలో ఈదురుగాలులతో వాన పడింది. ఫిర్జాదిగూడ, బోడుప్పల్ ఏరియాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వానలతో కొన్ని ప్రాంత్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.