ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ వద్దనడంతో పెండ్లికి నో చెప్పిన పెళ్లికూతురు

ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ వద్దనడంతో పెండ్లికి నో చెప్పిన పెళ్లికూతురు

    పోలీస్‌‌‌‌‌‌‌‌, ప్రొటెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కుదిరిన లగ్గం

    ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ వద్దు అనడంతో నో చెప్పిన పెళ్లికూతురు

   8 ఏళ్ల ప్రేమకు బ్రేక్‌‌‌‌‌‌‌‌

హాంకాంగ్‌‌‌‌‌‌‌‌: ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్న జంట పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. డేట్‌‌‌‌‌‌‌‌ ఫిక్స్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. కల్యాణ మండపం మాట్లాడుకున్నారు. డ్రెస్‌‌‌‌‌‌‌‌ డిజైన్‌‌‌‌‌‌‌‌ చేయించుకుంటున్నారు. కానీ ఉన్నట్లుండి అమ్మాయి పెళ్లికి నో చెప్పింది. హాంకాంగ్‌‌‌‌‌‌‌‌లో ఆరు నెలలుగా జరుగుతున్న గొడవలు పెళ్లి క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ అయ్యేలా చేశాయి. ఆందోళనకు పెళ్లికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. పెళ్లి కొడుకు హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పెళ్లికూతురు ప్రో–డెమోక్రసీ ప్రొటెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఆందోళనల టైమ్‌‌‌‌‌‌‌‌లో పోలీసులు ప్రొటెస్టర్లపై దాడికి దిగారని, అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావని తోటి ప్రొటెస్టర్లు అనడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన పెళ్లిని ఆమె క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది.

అసలేంటీ కథ

చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్‌‌‌‌‌‌‌‌లో ఆరు నెలలుగా ప్రో–డెమోక్రసీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు వారిపై టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌, రబ్బర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుల్లెట్లతో దాడి చేసి చాలా మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇది ఇలా ఉండగా ప్రో – డెమోక్రసీ కార్యకర్త మే న్యుపిటాల్‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌లోని ఒక పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. మే ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ దానికి అడ్డు చెప్పారు. ఆందోళనకారులను కొట్టి, అరెస్టు చేసిన పోలీస్‌‌‌‌‌‌‌‌ను ఎలా పెళ్లి చేసుకుంటావని అడగటంతో ఆలోచించిన ఆమె పెళ్లిని క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది. పెళ్లికి ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ రామని చెప్పడంతో దిక్కు తోచని స్థితిలో పెళ్లిని క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నానని మే మీడియాతో చెప్పింది. హాంకాంగ్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ఆందోళనలు దేశ ప్రజలను రెండు గ్రూపులుగా  విడిపోయేలా చేశాయి. దీంతో ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌, లవర్స్‌‌‌‌‌‌‌‌ కూడా విడిపోతున్నారని కొందరు ఆందోళనలకారులు చెప్పారు.

నా బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ పెళ్లికి రానని చెప్పింది. దేశంలో పోలీసులు, ప్రజల మధ్య ఎంత గ్యాప్‌‌‌‌‌‌‌‌ ఏర్పడిందో ఇప్పుడు తెలుస్తోంది. ఆందోళన లు ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌, లవర్స్‌‌‌‌‌‌‌‌ విడిపోయేలా చేశాయి.

– మే న్యుపిటాల్‌‌‌‌‌‌‌‌

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి