
- షాదీ కా ఖానా పేరుతో స్పెషల్ వంటకాలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో వెడ్డింగ్ ఫుడ్ పేరుతో డిఫరెంట్ రెస్టారెంట్లు నడుస్తున్నాయి. రుచికరమైన రకరకాల పెండ్లి వంటకాలను కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇక్కడ పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు ఉండరు.. కానీ పెండ్లి భోజనం ఏర్పాట్లు అన్నీ ఉంటాయి. స్టార్టర్స్ నుంచి డెసెర్ట్స్, బిర్యానీలు.. ఇలా పెండ్లిలో దొరికే ప్రతీ ఐటమ్ వెడ్డింగ్ఫుడ్లిస్టులో ఉంటాయి. మరికొందరు ఇదివరకు వీకెండ్స్‌లో ఫంక్షన్ హాల్స్‌లో వెడ్డింగ్ ఫుడ్ ఫెస్ట్లులు నిర్వహించేవారు. చాలా కాలం నుంచే ఈ వెడ్డింగ్ థీమ్ ట్రెండ్నడుస్తున్నప్పటికీ ఇటీవల ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది.
ఒకరోజు ముందుగానే బుకింగ్..
మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న ఫనూజ్ రెస్టారెంట్ షాదీ కా ఖానా పేరుతో ఘుమఘుమలాడే వెడ్డింగ్ ఫుడ్‌ను అందిస్తోంది. స్టార్టర్స్ నుంచి డెసెర్ట్స్, బిర్యానీలు, స్వీట్స్.. పెళ్లిళ్లలో ప్రధానంగా వడ్డించే ఐటమ్స్‌ను అందిస్తున్నారు. మటన్ హలీం, మటన్ లుక్మీ, నారీ పాయా, చికెన్ స్టార్టెర్స్, మటన్ లేదా చికెన్ బిర్యానీ, చికెన్, మటన్ కర్రీస్, రోటీ బాస్కెట్, డబుల్ కా మీఠా, కుర్బానీకా మీఠా ఇలా సుమారు 12 రకాల ఐటమ్స్‌ను షాదీ కా ఖానా లిస్టులో ఉంచారు.
పెద్దలకు రూ.945, పిల్లలకు రూ. 730 చెల్లించి అన్‌లిమిటెడ్‌గా ఫుడ్ లాగించేయొచ్చు. అయితే, ఫుడ్ఎవరిది వారే తినాలని.. పక్కవారికి షేర్ చేయడం, పార్సిల్ చేయించడం ఉండదని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ షాదీకా ఖానా కోసం ఒక రోజు ముందుగానే బుక్ చేసుకోవాలని అంటున్నారు. కనీసం ఇద్దరు కస్టమర్లు రావాల్సి ఉంటుందని, మాగ్జిమమ్ ఎంతమందైనా రావొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయొచ్చు
చాలా మంది వివిధ కారణాలతో పెండ్లిళ్లకు అటెండ్ కాలేరు. అలాంటి వారి కోసం మేము ప్రత్యేకంగా షాదీ కా ఖానా పేరుతో వెడ్డింగ్ ఫుడ్ థీమ్ తీసుకొచ్చాం. ఫ్యామిలీతో పాటు వస్తే వెడ్డింగ్ అట్మాస్పియర్ ఎంజాయ్‌చేస్తూ తినొచ్చు.
– నాసర్, వర్కర్, ఫనూజ్ రెస్టారెంట్