రెండు కుక్కల పెళ్లి.. 500 మందితో ఊరేగింపు

రెండు కుక్కల పెళ్లి.. 500 మందితో ఊరేగింపు

కొత్త బట్టలు, బంగారు ఆభరణాలు, ఘనంగా పెళ్లి.. ఇందులో వింతేమీ ఉందండీ అనుకోవచ్చు... కానీ ఈ పెళ్లి ఇద్దరు మనుషులకి కాదు...ఓ రెండు పెంపుడు కుక్కలకి.. అవును మీరు విన్నది నిజమే.. ఉత్తరప్రదేశ్ లోని హమీర్ పూర్ జిల్లాలోని భరువాలో హిందూ సాంప్రాదాయం ప్రకారం ఈ వింత పెళ్లి చేశారు ఓ ఇద్దరు సాధువులు. ద్వారకా దాస్​ మహారాజ్​కు ఓ పెంపుడు కుక్క ఉంది. అ కుక్కకి వివాహం చేయాలన్న ఆలోచన ఆయనకి వచ్చింది.

దీనితో అర్జున్​ దాస్​ పెంచుకునే ఆడకుక్కతో పెళ్లి ఫిక్స్ చేశాడు. జూన్ 5 ముహుర్తం పెట్టి భక్తులను ఆహ్వానించారు. 500 మందితో ఊరేగింపు కూడా చేశారు. మరి పెళ్లి అంటే ఆశామాషీగా కాకుండా వాటికి కొత్త బట్టలు, బంగారు ఆభరణాలతో ఆలంకరించారు.  ఆ తర్వాత ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లికి వచ్చిన ఆతిధులకి రకరకాల వంటలతో భోజనాలు వడ్డించారు.

ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

మరిన్ని వార్తలు.. 

ఏసీబీకి చిక్కిన ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్

ఆసుపత్రిలో చేరిన నవజ్యోత్‌ సిద్ధూ