ఏసీబీకి చిక్కిన ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్

ఏసీబీకి చిక్కిన ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్

కాసులు చేతిలో పెట్టనిదే ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్  పనిని చేసేది లేదని వాళ్లు  తేల్చి చెప్పారు. మేడ్చల్ జిల్లా ఔషాపూర్ గ్రామ కంఠానికి సంబంధించిన రెండు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సుదర్శన్ అనే వ్యక్తి నుంచి రూ.70వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.లంచం తీసుకుంటుండగా  సబ్ రిజిస్ట్రార్ సీతారాం, అసిస్టెంట్ కిశోర్ లను పట్టుకున్నారు. లంచం అడగడం వల్లే తాను ఏసీబీని ఆశ్రయించానని బాధితుడు సుదర్శన్ తెలిపారు. 

మరిన్ని వార్తలు..

గోల్స్ వర్షంతో మెస్సీ అరుదైన రికార్డు

బాలిక కేసులో దోషులను తప్పించే కుట్ర