జానయ్యపై పెట్టిన కేసులు ఎత్తేయాలి: మేకల యాదన్న యాదవ్

జానయ్యపై పెట్టిన కేసులు ఎత్తేయాలి: మేకల యాదన్న యాదవ్

నల్గొండ అర్బన్, మిర్యాలగూడ, వెలుగు: మంత్రి జగదీశ్‌ రెడ్డి డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యపై అక్రమంగా పెట్టిస్తున్న కేసులను వెంటనే ఎత్తేయాలని యాదవ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మేకల యాదన్న యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో గడియారం సెంటర్‌‌లో ధర్నాకు యత్నించగా.. పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.  అలాగే నల్లగొండ బస్టాండ్ సమీపంలో యాదవ సంఘం నాయకులు మంత్రి జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.  మిర్యాల గూడలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపేందుకు బయల్దేరిన నేతలను  పట్టణ పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. 

 అనంతరం సంఘం నేతలు మాట్లాడుతూ మంత్రి జగదీశ్ రెడ్డికి గెలుపు కోసం కృషి చేసిన వట్టె జానయ్యపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణమన్నారు.  ఇన్నాళ్లు లేనిది పార్టీ మారతానని చెప్పగానే రెండు రోజుల్లోనే 70కి పైగా కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు.  వెంటనే కేసులు ఎత్తేయాలని లేదంటే యాదవుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘాల నేతలు  అల్లివేణి యాదవ్ ,  మేకల రాముల యాదవ్,  చిలక శ్రీనివాస్ యాదవ్,  సుభాష్ యాదవ్, గుండెబోయిన వెంకన్న, లోహిత్, రాజు,  మోడీ రాందేవ్ , గుండెబోయిన  మల్లయ్య, సైదులు,  యాదగిరి, బుర్ర సైదులు తదితరులు పాల్గొన్నారు.