వారఫలాలు ( 2026 మే 17–23 ) : ఈ వారం గ్రహాల సంచారం ఎలా ఉంది.. ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది. ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 12 రాశుల వారి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం..!
మేషరాశి: ఈ రాశి వారు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. బంధువుల తాకిడి అధికంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ద చూపాలని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు జోరుగా సాగుతాయి.. ప్రైవేట్ ఉద్యోగస్తులకు అన్ని విధాల బాగుంటుంది.
మిథునరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఈ వారంలో స్థిరత్వంతో పాటు మంచి అవకాశాలు ఉంటాయి. . కొన్ని పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారులకు ఇది లాభదాయకంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. కొత్త ఒప్పందాలు, ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. . ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం, నమ్మకం పెరిగే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ వారం అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య అవగాహనలోపంతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. కంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో తెలియని విషయం మనసును కలవరపెడుతుంది. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి. ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. వ్యాపారస్తులకు ఈ వారం కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుతుంది.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం కొంత ఒత్తిడితో కూడిన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పెద్దలతో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇతరులతో మాట్లాడేడప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. జీవిత భాగస్వామి సలహా.. సంప్రదింపులను పాటించండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగడంతో పాటు... కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి.వారం చివరిలో అంతా బాగానే ఉంటుంది. ఎలాంటి ఆందళన చెందాల్సిన అవసరం లేదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రేమ వ్యవహారాలను వాయిదా వేయండి.
కన్యారాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. కొత్త అవకాశాలు, ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరు ద్వారా మంచి గుర్తింపు పొందుతారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం, నమ్మకం పెరుగుతాయి.
తులా రాశి: ఈరాశి వారికి ఈ వారం కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కొత్త పరిచయాలు బలపడే అవకాశం ఉంది. ఈ వారం చాలా ప్రశాంతంగా గడునుతారని పండితులు సూచిస్తున్నారు. ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
వృశ్చికరాశి: ఈ రాశి వారు ఈ వారం తీరిక లేకుండా గడుపుతారు.ప్రతి విషయంలో మొండి పట్టుదలతో ఉంటారు. ఇతరులు చెప్పిన విషయాలను ఆలకించండి. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడవద్దు. ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండవు. వ్యాపారాలు నిలకడగా సాగుతుతాయి. వృత్తి ఉద్యోగ విధుల పట్ల ఏకాగ్రత వహించండి. బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఆర్థికంగా.. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
మకర రాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభించడంతో పాటు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు కలసివస్తాయి. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి.వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. ఉద్యోగస్తులు ఒత్తిడి, శ్రమ పెరిగే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. తోటి ఉద్యోగులతో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. వారం చివరికి పరిస్థితులు కొంత మెరుగవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మీనరాశి: ఈ రాశి వారు ఈ వారం చాలా ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. కుటుంబసభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గతంలో మిమ్మలను విబేధించిన వారు ఈ వారం చివరిలో మీ దగ్గరకు వస్తారు. రాజకీయ నాయకులు ఈ వారం గుడ్న్యూస్ వినే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. వారం చివరిలో కొంత ఆందోళనతో గడపాల్సిన పరిస్థితులు వస్తాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
