వారఫలాలు 2023 అక్టోబర్ 01 నుంచి 07 వరకు

వారఫలాలు  2023  అక్టోబర్  01 నుంచి 07 వరకు

మేషం

కష్టం ఫలిస్తుంది. కార్యక్రమాలలో విజయం. పలుకుబడి కలిగిన వారు పరిచయమై సాయపడతారు. రాబడికి లోటు ఉండదు. విద్య, ఉద్యోగాన్వేషణలో ముందడుగు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత. కొన్ని మోసాల నుంచి బయటపడతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. క్రీడాకారులు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అపార్ధాలు తొలగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు ఉన్నతస్థితికి చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ప్రయత్నాలు సఫలం.

వృషభం

కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. సన్నిహితులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు ఫలించవు. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదిస్తారు. విద్యార్థులకు అవకాశాలు కొన్ని చేజారవచ్చు. కుటుంబ బాధ్యతలపై అధిక దృష్టి సారిస్తారు. సంతానపరంగా కొన్ని సమస్యలు ఎదురై పరీక్షగా మారవచ్చు. వ్యాపారులకు ఆశించిన లాభాలు కష్టం. ఉద్యోగులకు అదనపు పనిభారం. వారాంతంలోవిందులు, వినోదాలు. వాహనసౌఖ్యం. కొత్త పరిచయాలు.

మిథునం 

అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖుల పరిచయం. విద్యార్థుల ప్రయత్నాలు కొలిక్కివస్తాయి. ఒక లేఖలోని సారాంశం ఆకట్టుకుంటుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు సఫలం. మీపై వచ్చిన  విమర్శలు తొలగుతాయి. ఇంటినిర్మాణ ఆలోచనలకు కార్యరూపం. వ్యాపారులకు లాభాల వేటలో విజయం. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు లక్ష్యసాధనలో ముందడుగు. 

కర్కాటకం

మీ పట్టుదల, ధైర్యానికి ఈవారం పరీక్షా సమయమే. ఒక సమాచారం గందరగోళం సృష్టించవచ్చు. తరచూ ప్రయాణాలు. విద్యావకాశాలు తృటిలో చేజారవచ్చు. ఆదాయానికి లోటు లేకున్నా ఖర్చుల వల్ల అప్పులు. కొన్ని విషయాల్లో రాజీమార్గం తప్పనిసరి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత పాటించాలి. వ్యాపారులు అందిన లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. వారారంభంలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి.

 సింహం

మీ అంచనాలకు తగిన రాబడి. ఖర్చులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో హామీలు మంచిది కాదు. ఆస్తుల వివాదాలు మరింత పెరిగే అవకాశం. ఆస్తి విషయంలో తండ్రి తరఫు వారితో వివాదాలు నెలకొనవచ్చు. ముఖ్య కార్యక్రమాలు నిదానంగా పూర్తి. ఇంటి నిర్మాణాల్లో జాప్యం. వ్యాపారులు ఆశించిన లాభాలు దక్కక డీలా పడతారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. వారాంతంలోధనలాభం. ఆహ్వానాలు అందుతాయి. సత్కారాలు.

కన్య

తండ్రి తరఫున ఆస్తి లేదా ధనలాభ సూచనలు.  భూములు, వాహనాలు కొనే యత్నాలు సానుకూలం. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు. ఇంటి నిర్మాణాలు,కొనుగోలులో ముందడుగు. కొంత కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తి. క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభించవచ్చు. వ్యాపారులు లాభాల అన్వేషణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు విధుల నుంచి ఉపశమనం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అరుదైన ఆహ్వానాలు. 
 
తుల

ఆదాయం తగ్గినా అవసరాలకు  లోటు ఉండదు. ఆస్తుల వివాదాలు ఓర్పుతో పరిష్కారం. అనుకున్న కార్యక్రమాలు నిదానంగా పూర్తి. అందరిలోనూ పలుకుబడి పెంచుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. గతంలో చేజారిన ఆస్తులు తిరిగి దక్కించుకుంటారు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వ్యాపార లావాదేవీలు గతం కంటే  ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహం.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కొన్ని విషయాలలో జోక్యం వల్ల చిక్కులు ఎదురుకావచ్చు. మీపై ఉంచిన బాధ్యతల నిర్వహణలో ఒత్తిడులకు లోనవుతారు. తరచూ ప్రయాణాలు. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి విషయాలలో కుటుంబ సభ్యులతో విభేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోండి. వ్యాపారాలు కొంత మెరుగుపడే అవకాశం. ఉద్యోగులకు నిరుత్సాహం. వారాంతంలో శుభవర్తమానాలు. వాహనయోగం. 

ధనుస్సు

కుటుంబసమస్యలు తీరతాయి. మీ ఆశయాలు నెరవేరేందుకు మిత్రులు సహకరిస్తారు.  కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. కుటుంబంలో శుభ కార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఊహించని శుభవార్తలు. వాహనాలు, స్థలాలు కొంటారు. రావలసిన డబ్బు అందే సూచనలు.  మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలు సాధిస్తారు.

మకరం

ఆలోచనలకు కార్యరూపం. నిరుద్యోగుల  ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనసౌఖ్యం. కార్యక్రమాలు అనుకున్న మేరకు  సాగుతాయి. వాహనాలు, ఇళ్ల కొనుగోలు ప్రయత్నాలు కొలిక్కివస్తాయి. సంతానంలో  ఒకరికి విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు దక్కే ఛాన్స్. అన్ని అవకాశాలు వినియోగించుకుంటూ విజయాల బాటలో నడుస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. తగిన  పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు ఊహించని సన్మానాలు.

కుంభం

పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు సానుకూలం. కోర్టు వ్యవహారాలలో పురోగతి. ముఖ్య కార్యక్రమాలు విజయవంతం. వివాహయత్నాలు ముమ్మరం. సంతానపరంగా చిక్కులు తొలగుతాయి. మీ నిర్ణయాలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. ముక్కుసూటిగా మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు.  వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందే అవకాశం.

మీనం

ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నిరుద్యోగుల కల నెరవేరుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు, లాభాలు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

వక్కంతం చంద్రమౌళి జ్యోతిష్య పండితులు ఫోన్​: 98852 99400