వారఫలాలు ( సౌరమానం)  ఏప్రిల్ 21  నుంచి 27  వరుకు 

వారఫలాలు ( సౌరమానం)  ఏప్రిల్ 21  నుంచి 27  వరుకు 

మేషం : ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. అనుకోని ఆహ్వానాలు. క్రీడాకారులకు ఊహించని గౌరవం. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. అవసరాలకు లోటు రాదు. పెద్దల సలహాలతో ముందుకు సాగుతారు. వేడుకల నిర్వహణలో మార్పులు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి, లాభాలు రాగలవు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు తగినంత ప్రోత్సాహం.

వృషభం : దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. చేపట్టిన కార్యాలు సజావుగా సాగుతాయి. వాహనయోగం. సమాజంలో పలుకుబడి. నిరుద్యోగులకు ఊరట. సొమ్ములకు లోటు రాదు. అప్పుల బాధలు తీరతాయి. కొన్ని వేడుకలు క్లుప్తంగా నిర్వహిస్తారు. బంధువుల నుంచి సాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు. భాగస్వాముల నుంచి పెట్టు బడులు. ఉద్యోగులకు కోరుకున్న బాధ్యతలు. పారి శ్రామికవేత్తలు, కళాకారులకు కొంత అనుకూలం.

మిధునం : ముఖ్యమైన కార్యాల్లో విజయం. ఆస్తి విషయాల్లో  అగ్రిమెంట్లు. శత్రువులను సైతం స్నేహితులుగా మార్చుకుంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మీపై కుటుంబసభ్యుల ఆదరణ ఉంటుంది. మీ నిర్ణయాలను సమర్థిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం.

కర్కాటకం : చేపట్టిన కార్యాలు సకాలంలో పూర్తి. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆశించిన సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుని లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులకు క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్రీడాకారులు, రాజకీయవేత్తల ఆశలు ఫలించే సమయం.

సింహం :  దూరప్రయాణాలు సంభవం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. అవసరాలకు తగినంత సొమ్ము అందినా ఖర్చులు ఎదురవుతూనే ఉంటాయి. అప్పుల కోసం యత్నిస్తారు. వ్యాపారులకు  లాభాలు కనిపించవు. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు  ఊహించని మార్పులు. పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితి. కళాకారులు, పరిశోధకుల యత్నాలలో స్వల్ప ఆటంకాలు. వారాంతంలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.

కన్య : కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉపకరిస్తాయి. సమాజంలో మీదే పైచేయి. ఆస్తులు కొంటారు. అదనపు ఆదాయం. ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. పెట్టుబడులు రాగలవు. ఉద్యోగులు విధులలో అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు శ్రమ ఫలించే సమయం. క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల : వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఆశలు రేకెత్తిస్తాయి. వాహనయోగం కలిగే సూచన. అనుకున్న సమయానికి రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపారులకు ఊహించని  పెట్టుబడులు, ఆశించిన లాభాలు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉపకరిస్తాయి. పారిశ్రామిక వర్గాలు కొత్త సంస్థల ఏర్పాటు దిశగా సాగుతారు. క్రీడాకారులు, పరిశోధకుల యత్నాలు సఫలమవుతాయి.

వృశ్చికం : పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఒక లేఖ ద్వారా అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారులకు అనుకున్న లాభాలు. భాగస్వాములతో చర్చలు సఫలం. ఉద్యోగులు ఇంత కాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవేత్త లు, కళాకారులకు ఊహించని ఆదరణ. వైద్యులు, వ్యవసాయదారులకు ఉత్సాహంగా ఉంటుంది.

ధనుస్సు : ముఖ్యమైన కార్యాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు ఉండవచ్చు. స్నేహితులతో కొన్ని విషయాల్లో అవగాహనకు వస్తారు. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకు సాగుతారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. అవసరాలకు సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు పదోన్నతులు దక్కినా పనిభారం తప్పదు. రాజకీయవేత్తలకు క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. పరిశోధకులు, శాస్త్రవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మకరం : అనుకోకుండా దూరప్రయాణాలు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వివాదాల నుంచి బయటపడేందుకు చేసే యత్నాలు సఫలం. ఆలోచనలకు కార్యరూపం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలులో కొంత జాప్యం. డబ్బుకు ఇబ్బంది లేకున్నా అవసరాలు పెరిగి అప్పులు చేస్తారు. సోదరులతో మరింత సఖ్యత. వ్యాపారులు  కొత్త అంచనాలతో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఊహించని విధంగా ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూలస్థితి.

కుంభం : స్నేహితుల నుంచి రహస్య విషయాలు తెలుస్తాయి. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. వాహనసౌఖ్యం. ఆదాయం అనుకూలిస్తుంది. ఆశించిన డబ్బు చేతికందుతుంది. విదేశాల్లో సంతాన క్షేమసమాచారాలు ఊరటనిస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తగ్గుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు నేర్పుగా వ్యవహారాలు చక్కదిద్దుతారు.

మీనం : ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం. నూతన ఒప్పందాల ద్వారా కొంత సొమ్ము అందుతుంది. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు పూర్తి. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటు యత్నాలు కలిసివస్తాయి.  క్రీడాకారులకు నూతనోత్సాహం.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400