వారఫలాలు ( ఫిబ్రవరి 22‌‌–28):  ఈ వారంలో పంచగ్రహకూటమి ప్రభావం .. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..

వారఫలాలు ( ఫిబ్రవరి 22‌‌–28):  ఈ వారంలో పంచగ్రహకూటమి ప్రభావం .. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..  ఈ వారంలో ఫిబ్రవరి 23 వ తేదీన పంచగ్రహకూటమి  ఏర్పడనుంది.  దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.  ముఖ్యంగా సూర్యుడు.. కుజుడు..కుంభరాశిలో కలవడం వలన ఆదిత్య మంగళయోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ యోగం ఎఫెక్ట్​తో ఈ వారం 12 రాశుల వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. . .!

మేష రాశి:  ఈ రాశి వారికి ఈ వారంలో  పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల శుభాలు ఎక్కువగా కలుగుతాయని పండితులు చెబుతున్నారు.  వ్యాపారులకు ఈ వారం పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. కొత్త ఆదాయ సంపాదన  మార్గాల్లో  ధన లాభాలను అర్జిస్తారు. ఏ పని తలపెట్టిన పనులు విజయవంతం చేసుకుంటారు. ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేసే వారు ప్రమోషన్లను పొందుతారు. సాఫ్ట్ వేర్ రంగంలో పని చేసే ఉద్యోగులకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.  కొత్త ఒప్పందాలు, లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పై అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి.  

వృషభ రాశి: ఈ వారం ఈ రాశి వారికి మొదట్లో సాధారణంగా ఉన్నా.. నిదానంగా మీరు తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.  వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి.  సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.  వ్యాపార లావాదేవీలు అనుకూలంగా సాగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.  ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

మిధున రాశి: ఈ వారం ఈ రాశి వారికి  గ్రహ సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. అధికారుల నుండి ఒత్తిళ్లు తగ్గుతాయి. సమాజంలో  మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు  పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా సాగడంతో మంచి ఆర్థిక లాభాలు కూడా చేతికిందుతాయి.  కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి ఉంటుంది.  వృత్తి... వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి  వస్తాయి. 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి పంచగ్రహకూటమి ప్రభావం వలన కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.  .కొన్ని ఊహించని సంఘటనలు మానసిక అశాంతిని కలిగిస్తాయి.  డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మాట్లాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి.  ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలుంటాయి.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ... పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి. 

సింహరాశి:  ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి.  ప్రతి పనిలో  కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు.  కొత్త పెట్టుబడుల విషయంలోఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు.  విద్యార్థుల విషయంలో కేరీర్ పరంగా నిర్ణయాలు తీసుకుంటారు.  ఆర్థిక విషయాల్లో మిశ్రమఫలితాలుంటాయి.  వారం మధ్యలో నుంచి కొంత ఊరట లభిస్తుంది. స్థిర ఆస్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

కన్య రాశి:ఈ రాశి వారికి  గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు వస్తాయి.  అప్పులు తీర్చేందుకు ప్రయత్నం చేస్తారు. విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ పరంగా గత కొద్ది రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు.  వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.  కుటుంబ జీవితం కూడా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.  నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి

తులా రాశి:  ఈ రాశి వారికి  ఈ వారం పంచగ్రహ కూటమి ప్రభావం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కొత్త పెట్టుబడుల విషయంలో ఈవారం కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. కీలకమైన నిర్ణయాల విషయంలో పెద్దలు సలహాలు పాటించండి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. . ఉద్యోగస్తులకు పని భారం మాత్రం అధికంగా ఉంటుంది. పనిపై శ్రద్ద పెట్టండి. జీవిత భాగస్వామితో సంతోషకర సమయాన్ని గడుపుతారు.

వృశ్చిక రాశి:   పంచగ్రహ కూటమి  ప్రభావం వలన ఈ రాశి వారికి ఈ వారంలో  పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. కొన్ని కీలకమైన ఒప్పందాలను కూడా చేసుకుంటారు. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. అనూహ్యమైన లాభాలను అందుకుంటారు.ఉద్యోగులకు వారం ప్రారంభం అనుకూలంగా ఉన్నప్పటికీ బుధవారం నుండి విపరీతమైన పని ఒత్తిడి విసిగిస్తుంది.  అధికారులతో వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో  జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  బంధుమిత్రుల సహకారం వల్ల కొన్ని ముఖ్యమైన పనులను మాత్రం పూర్తి చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి  ఈ వారంలో గ్రహ బలాల వలన అంతా శుభంగానే ఉంటుందని జ్యోతిష్య పండిలు చెబుతున్నారు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయమార్గాలు కలిసి వస్తాయి. ఎప్పటినుండో ఇబ్బంది పెడుతున్న కొన్ని కుటుంబ, వ్యక్తిగత సమస్యలు తీరి మనసుకు ఊరట లభిస్తుంది. పెండింగులో ఉన్న ముఖ్యమైన పనుల్లో కదలిక వస్తుంది.ఉద్యోగులకు ప్రమోషన్​ రావడంతో పాటు .. బాధ్యతలు పెరుగుతాయి. ఆర్ధిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కలుగుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి.  ఆరోగ్య విషయంలో శ్రద్ద చూపాలని పండితులు సూచిస్తున్నారు. 

మకర రాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమఫలితాలుంటాయి.తలపెట్టిన పనులు  నిదానంగా  పూర్తి చేసుకుంటారు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి.  ఊహించని ఖర్చులు రావడంతో ఆర్ధిక విషయాల్లో ఇబ్బందికర పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులు మాత్రం  ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ లకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి.ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలు తీసుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి.  

కుంభ రాశి: పంచగ్రహకూటమి ప్రభావంతో ఈ వారంలో ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎప్పటినుంచో వేధిస్తున్న కొన్ని ఆస్తివివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి.కొత్త పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం పెద్దగా అనుకూలంగా లేదు.  పాత వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  ఆకస్మికంగా వచ్చే ఖర్చుల వల్ల అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటారు.  ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.వాహనం డ్రైవింగ్‌ చేసేటప్పుడు  అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మౌనంగా ఉండటమే మీ సమస్యలకు పరిష్కారం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. 

మీన రాశి: ఈ రాశి వారికి ఈవారం అంత అనుకూలంగా లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా సాగుతాయి. ఆశించిన లాభాలు చేతికందకపోగా, ఖర్చుల భారం పెరుగుతుంది.రిస్క్ తో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండండి.ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తుల విషయంలో అనవసరంగా మాట పడాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. ఎవరితోనూ అనవసరమైన వాగ్వివాదాలకు వెళ్ళవద్దు. ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వవద్దు. మీరు మంచి కోసం చెప్పినా అవి మీకే తలనొప్పులను తీసుకువస్తాయి.  ప్రేమ వ్యవహారాలు పెద్దగా కలిసి రావని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.