Weight loss: గుడ్లు Vs పనీర్ : బరువు తగ్గేందుకు ఏది మంచి ఫుడ్ అంటే..

Weight loss: గుడ్లు Vs పనీర్ : బరువు తగ్గేందుకు ఏది మంచి ఫుడ్ అంటే..

పనీర్, గుడ్లు అంటే చాలా మంది ఇష్టపడడం చూస్తూనే ఉంటాయి. అంతే కాదు ఈ రెండింటిలోనూ పోషక విలువలు పుష్కలంగా ఉండడంతో అనేక మంది ఆరోగ్యపరంగా హెల్దీగా ఉండేందుకు వీటిని తీసుకుంటూ ఉంటారు. పనీర్ తేలికపాటి క్రీము, నీటి రుచులను కలిగి ఉంటుంది. గుడ్లు కాస్త ఉప్పగా ఉంటుంది. శాకాహారులకు పనీర్ మాత్రమే ప్రోటీన్ మూలం. కానీ మాంసాహారులకు ఎంచుకోవడానికి రెండు ఎంపికలు ఉన్నాయి. అయితే బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైన, మంచి ఎంపిక- గుడ్లా లేదా పనీరా? ఇప్పుడు తెలుసుకుందాం.

 ఉడికించిన గుడ్డు (సుమారు 44 గ్రాములు)లో...

    ప్రోటీన్: 5.5 గ్రా
    మొత్తం కొవ్వు: 4.2 గ్రా
    కాల్షియం: 24.6 మి.గ్రా
    ఐరన్: 0.8 మి.గ్రా
    మెగ్నీషియం: 5.3 మి.గ్రా
    భాస్వరం: 86.7 మి.గ్రా
    పొటాషియం: 60.3 మి.గ్రా
    జింక్: 0.6 మి.గ్రా
    కొలెస్ట్రాల్: 162 మి.గ్రా
    సెలీనియం: 13.4 మైక్రోగ్రాములు (mcg)

40 గ్రాముల పనీర్‌లో..

    ప్రోటీన్: 7.54 గ్రా
    కొవ్వు: 5.88 గ్రా
    పిండి పదార్థాలు: 4.96 గ్రా
    ఫోలేట్స్: 37.32 మైక్రోగ్రామ్
    కాల్షియం: 190.4mg
    భాస్వరం: 132 మి.గ్రా
    పొటాషియం: 50 మి.గ్రా

గుడ్లు చాలా చౌకగా లభిస్తాయి. వీటిని చాలా రకాలుగా తీసుకోవచ్చు. గిలకొట్టిన గుడ్లు, గుడ్డు కూర, ఉడికించిన గుడ్లు లాంటి భిన్న రెసిపీలను ఆస్వాదించవచ్చు. కొందరు అధిక కొవ్వు పదార్ధం కారణంగా పచ్చసొనను తీసేసి, కేవలం తెల్లని భాగాన్ని మాత్రమే తీసుకుంటారు. కానీ పసుపు భాగమే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.

పనీర్ లేదా కాటేజ్ చీజ్ విషయానికి వస్తే, ఇది భారతదేశంలో ప్రసిద్ధ పాల ఉత్పత్తికి సంబంధించింది. ఇందులో కాల్షియం, విటమిన్ B12, సెలీనియం, విటమిన్ D, రైబోఫ్లావిన్‌లు చాలా సమృద్ధిగా ఉంటాయి. దీన్ని సలాడ్, పనీర్ కూరగా కూడా తినవచ్చు పాలవిరుగుడు నుంచి పెరుగును వేరు చేయడం ద్వారా కాటేజ్ చీజ్ తయారవుతుంది.

గుడ్లు, పన్నీర్ లో ప్రోటీన్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలని ప్రయత్నించే శాఖాహారులు పనీర్ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. గుడ్లు, పనీర్ కాకుండా, చికెన్, చీజ్ (మోజారెల్లా, చెడ్డార్) బీన్స్, ముంగ్ బీన్స్, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, బ్రోకలీ వంటివి ప్రోటీన్ లభించే ఇతర గొప్ప వనరులు. గుడ్లు, పనీర్‌కు అలెర్జీ ఉన్న ఎవరైనా ఈ ప్రోటీన్-రిచ్ ఫుడ్‌లను ఎంచుకోవచ్చు.