
శామీర్ పేట, వెలుగు: బిల్డింగ్ పైనుంచి కింద పడి వెల్డర్ చనిపోయిన ఘటన శామీర్‌పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి మజీద్ పూర్లోని ప్రజయ్ హోమ్స్‌లో ఉన్న ఓ సీడ్స్ ఫ్యాక్టరీలో 20 అడుగుల ఎత్తులో ఉన్న ఐరన్ రాడ్‌పై కేమిడి కుమారస్వామి(38) వెల్డింగ్ పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడటంతో కుమారస్వామి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి చెప్పారు.