
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్, రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో తన నిర్వహణలోని ఆస్తులను (ఏయూఎం) మూడు రెట్లు పెంచి 100 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.8.5 లక్షల కోట్లు) చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
బ్రూక్‌ఫీల్డ్ గత 15 సంవత్సరాలుగా భారతదేశంలో చురుకుగా పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధనం ప్రైవేట్ ఈక్విటీ వంటి రంగాలలో సుమారు 30 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోంది.