ఢిల్లీలో నీటి సంక్షోభం.. సీఎం రేఖా గుప్తాకు అతిశీ లేఖ

ఢిల్లీలో నీటి సంక్షోభం.. సీఎం రేఖా గుప్తాకు అతిశీ లేఖ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని ప్రతిపక్ష నాయకురాలు అతిశీ తెలిపారు. ఈ అత్యవసర సమస్యను చర్చించడానికి వెంటనే సమయం కేటాయించాలని సీఎంను కోరారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు ఆమె లేఖ రాశారు. నీటి సరఫరాలో అంతరాయంతో ఢిల్లీవాసులు ఇబ్బంది పడుతున్నారని అతిశీ చెప్పారు. బకెట్లతో క్యూ లైన్లలో నిల్చొని ఉన్న మహిళలు, కుండలతో వేచి ఉన్న పిల్లల సీన్స్ ఢిల్లీకి కొత్త గుర్తింపుగా మారాయని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీ ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. నీటి సరఫరా 24 గంటల పాటు నిలిపేసినా అడ్మినిస్ట్రేషన్ మాత్రం మౌనం వహించిందని అతిశీ మండిపడ్డారు.