ఆపత్కాలంలో దేశ ఐక్యతను ప్రశ్నిస్తవా..? రాహుల్ గాంధీపై సింధియా ఫైర్

ఆపత్కాలంలో దేశ ఐక్యతను ప్రశ్నిస్తవా..? రాహుల్ గాంధీపై సింధియా ఫైర్

గ్వాలియర్: దేశ ఐక్యత, సమగ్రతను ప్రశ్నించడం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలవాటైందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు. 140 కోట్ల మంది ఏకమైనా రాహుల్ గాంధీ అదేపనిగా మన దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం రాత్రి గ్వాలియర్‎లో మీడియాతో సింధియా మాట్లాడారు. విదేశాంగ మంత్రి జైశంకర్‎ను సమయం, సందర్భం అంటూ లేకుండా రాహుల్ అదేపనిగా ప్రశ్నిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. 

ఆపత్కాలంలో దేశమంతా ఏకమైనా కొన్ని శక్తులు మన దేశ సార్వభౌమత్వం, ఐక్యతను ప్రశ్నిస్తున్నాయని విమర్శించారు. అదేమి ఐడియాలజీ అని నిలదీశారు. ఆ భావజాలం ఎవరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. కాగా.. భారత విదేశాంగ విధానం పతనమైందని జైశంకర్ ను లక్ష్యంగా చేసుకుంటూ రాహుల్  అంతకుముందు విమర్శించారు. ఈ నేపథ్యంలో సింధియా కౌంటర్ వేశారు.