వెల్ది టీచర్కు అంతర్జాతీయ పురస్కారాలు

వెల్ది టీచర్కు అంతర్జాతీయ పురస్కారాలు

రఘునాథపల్లి, వెలుగు: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని వెల్ది తెలంగాణ మోడల్ స్కూల్ ఇంగ్లిష్​ టీచర్​గా పనిచేస్తున్న కందగట్ల గణేశ్​కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. సామాజిక సేవ, విద్యారంగాల్లో ఆయన కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా సౌతాఫ్రికాకు చెందిన ‘గ్లోబల్ రాయల్ కింగ్‌‌‌‌డమ్ – పిల్లర్స్ ఆఫ్ పీస్ ఇంటర్నేషనల్’ సంస్థ, నైజీరియాకు చెందిన ‘ఎ వాక్ త్రూ ఎడ్యుకేషన్ – గ్లోబల్ ఇంటెలెక్చువల్ ఎక్స్​చేంజ్’ సంస్థ గౌరవ ప్రశంసా పత్రం, అత్యుత్తమ ప్రతిభా పురస్కరాలతో సత్కరించాయి. స్కూల్​ ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.